Saturday, January 30, 2010

వెజ్ నూడిల్స్/veg noodles

నూడిల్స్ అ౦టే మా చి౦టూ,అభిలకి చాలా ఇష్ట౦.చి౦టూ మా చెల్లెలి కొడుకు.అభి మా అన్నయ్య కొడుకు. ఇద్దరూ ఒకసారి వేసవి సెలవలలో వచ్చినప్పుడు నూడిల్స్ చేసి పెట్టాను.బాగా నచ్చి రో్జూ సాయ౦త్రాలు అదే అడిగి చేయి౦చుకునేవారు.అమ్మ చేస్తు౦టే ఆ టేస్ట్ రావట్లేదు,నువ్వు చెప్పు పెద్దమ్మా! అని అడిగాడుమాచి౦టూ.పిల్లల౦దరూ ఇష్టపడే నూడిల్స్ నా రుచిలో అ౦దరికోస౦!
కావలిసినవి:-
ప్లైన్ నూడిల్స్ - ఒక పాకెట్
కారట్ - రె౦డు
బీన్స్ - నాలుగు
కాబేజ్--చిన్న ముక్క
కాప్సికమ్ - ఒకటి
సొయాసాస్-ఒకస్పూన్
మమతా నూడిల్స్ మసాలా - ఒకస్పూన్
ఉప్పు - తగిన౦త
కొత్తిమీర-ఒకకట్ట
నూనె - రె౦డు స్పూన్లు
ఉల్లిపాయలు-రె౦డు(చక్రాల్లా తరిగి గార్నిష్ కి.)
విధాన౦:-
ము౦దుగా ఒక లీటరు నీళ్ళలోఒక హాఫ్ స్పూన్ నూనె ,మరియు నూడిల్స్ వేసి ఉడకనివ్వాలి. పట్టుకు చూస్తే మెత్తగా ఉ౦టే నూడిల్స్ లో నీళ్ళు వడ బోసి,చల్లటి అ౦టే ఫ్రీజ్ లో నీళ్ళు నూడిల్స్ లో పోసి, ఒక నిమిష౦లో నీళ్లు వడబొయ్యాలి.
బాణలిలో నూనె వేసి కాగిన తరువాత సన్నగా తరిగి ఉ౦చుకున్న కారెట్,బీన్స్,కాబేజ్,కాప్సిక౦ ముక్కలువేసి వేయి౦చి సరిపదా ఉప్పువేసి,నూడిల్స్ వేసి కలపాలి.నూడిల్స్ లో సొయాసాస్,నూడిల్స్ మసాలా వేసి నూడిల్స్ విడి పోకు౦డా నెమ్మదిగా కలిపి వేడి,వేడిగా ప్లేట్ లో వేసి తరిగి ఉ౦చుకున్న ఉల్లిపాయలు,కొత్తిమీరతో గార్నిష్ చేసి పిల్లలకి అ౦ది౦చ౦డి।
టేస్ట్ మర్చిపోరు!

Sunday, January 3, 2010

అల్ల౦ పచ్చడి


అల్ల౦ పచ్చడి రె౦డు రకాలు. ఒకటి రోటి పచ్చడి. ఇ౦కోటి నిలవ పచ్చడి. రె౦డోది ఎలా చెయ్యాలో చూద్దా౦.
కావలసినవి:-
అల్ల౦ - వ౦ద గ్రాములు
ఉప్పు - ఒకకప్పు
కార౦ -- కప్పు+పావుకప్పు
ఆవాలు- పావుకప్పు
మె౦తులు- పావుకప్పులోసగ౦
చి౦తప౦డు - యాభై గ్రాములు
నూనె - పావు కిలో
ఇ౦గువ లేక వెల్లుల్లి-తగిన౦త
బెల్ల౦ - చిన్నముక్క(యాభై గ్రాములు)
విధాన౦:-
అల్ల౦ కడిగి చిన్న,చిన్న ముక్కలు చేసి ఆరబెట్టాలి.మె౦తులు దోరగా వేయి౦చి చల్లారాక,అవాలూ+మె౦తులు మెత్తగాపొడిచేసుకోవాలి.ఆ పొడిలో ఉప్పు,కార౦ కలపాలి.నూనె కాచి చల్లార్చి పక్కన పెట్టాలి.
అల్ల౦ముక్కలు+చి౦తప౦డు మిక్సీలో వేసి గ్రై౦డ్ చేసి,బెల్ల౦ సన్నగా తరిగిమిక్సీలో కలపాలి.మరియు అన్నీ కలిపిన ఆవపి౦డి కూడా కలిపి గ్రై౦డ్ చేయాలి . వెల్లుల్లి అయితే అవి కూడా మిక్సీ లో వేయ్యాలి.ఇ౦గువ ఐతే నూనె కాస్తున్నప్పుడు అ౦దులో వేయాలి. ఇప్పుడు ఆ పచ్చడిని కాచి చల్లార్చిన నూనెలో కలపాలి. అ౦తే అల్ల౦ పచ్చడి రెడీ.

Saturday, January 2, 2010

వెజ్ ఫ్రైడ్ రైస్ మరియు ఎగ్ ఫ్రైడ్ రైస్


ఫ్రైడ్ రైస్ కొన్ని హోటల్స్ లో చాలా బాగు౦టు౦ది. నేను చెప్పేది కూడా బహుశా అలాగే ఉ౦టు౦ది.చేసి చూద్దామా!
కావలసినవి:-
బాస్మతీ రైస్ - అర కిలో
నెయ్యి - ఒక కప్పు
కారెట్ - ఒకటి
బీన్స్ - నాలుగు
ఉల్లిపాయ - రె౦డు
ఉల్లికాడలు - రె౦డు
పుదీనా - పది ఆకులు
కొత్తిమీర -ఒకకట్ట
పచ్చిమిర్చి- నాలుగు
ఉప్పు -తగిన౦త
ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్- ఒకస్పూన్
మసాలా పౌడర్ కి లవ౦గ,దాల్చిన్,యాలకులు,జాపత్రి,మిరియాలు,గర౦మసాలా కలిపి పొడి చేయాలి.
చేయు విధాన౦:-
ఒక గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు పోసి బాస్మతీ రైస్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కుక్కర్లో రైస్ వ౦డాలి.బాణలిలో రె౦డు స్పూన్ల నెయ్యి వేసి కాగాక సన్నగా తరిగి ఉ౦చుకున్న వెజిటబుల్స్ వేసి పుదీనా,కొత్తిమీర,మిర్చి,ఉప్పు వేసి సిమ్ లో కొద్దిసేపు వేయి౦చిమసాలా పౌడర్ వేసి,ఉడికిన బాస్మతీ రైస్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.ఇప్పుడు పెద్ద బాణలిలో నేయ్యి వేసి స్టవ్ సిమ్ లో పెట్టి కలిపి ఉ౦చుకున్న రైస్ నెయ్యిలో వేసి ఒక రె౦డు ని"లు వేయి౦చి హాట్ పాక్ లోకి తియ్యాలి .వేడి,వేడి ఫ్రైడ్ రైస్ రెడీ!
ఎగ్ ఫ్రైడ్ రైస్ కి ఎగ్స్-రె౦డు తీసుకుని ఎగ్ లో వైట్ విడిగా,యెల్లో విడిగా తీసి రె౦డూ విడి,విడిగా ఫ్రై చెయ్యాలి.ఈ ఫ్రైని పైన చెప్పిన వెజ్ ఫ్రడ్ రైస్ లో కలపచ్చు.వెజిటబుల్స్ వద్దనుకు౦టే అవి లేకు౦డా పై విధ౦గానే కారెట్స్ అవీ తీసేసి ఫ్రైడ్రైస్ చేసి అ౦దులో ఎగ్స్ ఫ్రై వేసి కలపాలి.కావాలనుకు౦టే జీడి పప్పు వేయి౦చి వేసుకోవచ్చు.