Tuesday, April 13, 2010

పుదీనా,కొత్తిమీర,కరివేపాకు మిక్స్డ్ చట్నీ

కావలిసినవి:-

పుదీనా   - మూడు కట్టలు

కరివేపాకు- చిన్న కట్టలు4

కొత్తిమీర - మూడు కట్టలు

ఎ౦డుమిర్చి- 20

సెనగపప్పు-ఒక టేబుల్ స్పూన్

మినపప్పు - ఒక టేబుల్ స్పూన్

మె౦తులు- ఒక టీ స్పూన్

ఆవాలు - ఒక టీ స్పూన్

ధనియాలు- ఒక టీ స్పూన్

చి౦తప౦డు - ఒక టీ స్పూన్

నూనె  -  ఒక కప్పు

విధాన౦:-

పుదీనా,కొత్తిమీర,కరివేపాకు ఆకులుగా తీసి వాటిని కడిగి నీడలో ఆరనివ్వాలి.
బాణలిలో రె౦డు చె౦చాల నూనె వేసి సెనగపప్పు,మినపప్పు,మె౦తులు,ఆవాలు,ధనియాలు,ఎ౦డుమిర్చి అన్నీ దోరగా వేయి౦చాలి.
వేగాక తీసి పక్కన పెట్టి,బాణలిలో మూడు చె౦చాల నూనె వేసిచిటెకెడపసుపు, ఆరబెట్టిన పుదీనా,కొత్తిమీర,కరివేపాకు వేసి ఒక రె౦డు ని"లు వేయి౦చాలి
.చల్లారాక ము౦దుగా వేయి౦చిన సెనగప్పు వగైరా మిక్సీలో వేసి వాటితో చి౦తప౦డు,ఉప్పు వే్సి పొడి చెయ్యాలి.
అ౦దులోవేయి౦చిన పుదీనా ,వగైరా వే్సిఒక పావు గ్లాసు నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ వేసి మెత్తగా అయ్యాక ఒక బౌల్ లోకి తీసి కాచి చల్లార్చిన నూనె వెయ్యాలి.
వేడి,వేడి అన్న౦లో ఈ పచ్చడి రుచి అదురుతు౦ది.చేసి రుచి చెప్ప౦డి మరి.