Monday, October 12, 2015

కంద బచ్చలి కూర (kanda bachali curry)

కంద బచ్చలి కూర ఆవ పెట్టి చేసుకుంటే ఇంకా బాగుంటుంది.ఎలా ఉంటుందో నా రుచిలో చూద్దాం...








 కావలసినవి:-

తెల్ల కంద - పావు కిలో

బచ్చలి    - రెండు కట్టలు

పచ్చిమిర్చి  - నాలుగు

అల్లం       - చిన్నముక్క

కొత్తిమిర   - ఒక కట్ట

కరివేపాకు - ఒక రెబ్బ

ఆవపొడి   - అరస్పూను

కారం     -పావుస్పూను

ఉప్పు     - తగినంత

నూనె    -  3 టేబుల్ స్పూన్లు

ఇంగువ   - పావు స్పూను

చింతపండు గుజ్జు - ఒక స్పూను

ఆవాలు +మినప్పప్పు+జీలకర్ర+సెనగపప్పు+జీడిపప్పు+ఎండుమిర్చి+ఇంగువ+కరివేపాకు+పసుపు ఇవి పోపు సామాన్లు.

 చేయు విధము: ----

 కంద తొక్క తీసి,నీళ్ళలో ఒకటికి రెండుసార్లు బాగా కడగాలి. బచ్చలి కడిగి సన్నగా తరగాలి. రెండూ కలిపి ఒక చిన్నగ్లాసు నీళ్ళు పోసి ఉడికించాలి.

 అల్లం కొత్తిమిర,పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవపొడిలో,కారం,కొద్దిగా నూనె,నీరు కలిపి ఒకపక్కన ఉంచాలి.

బాండీ లో నూనె వేసి కాగాక పైనచెప్పిన పోపు సామాను ఒకటొకటిగావేసి, వేయించి,అందులో అల్లం వగైరా పేస్ట్ వేసి,ఉడికించి ఉంచుకున్న కందబచ్చలి ఒకసారి మెదిపి పోపులో వేయాలి. ఉప్పు వేసి బాగా కలిపి చింతపండు గుజ్జు వేసి కలిపి ఒక ఐదు ని"లు మగ్గనిచ్చి, దించేముందు కలిపి ఉంచుకున్న ఆవ అందులో వేసి బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి. ఆవ ఘుమ,ఘుమలతో కంద బచ్చలి కూర రెడీ!



Friday, October 9, 2015

ఉలవచారు (horse gram)



 ఔషధ గుణాలు కలిగిన "ఉలవచారు" మరియు "ఉలవల మొలకలు".వీటి వల్ల ఉపయోగాలు,తయారుచేయు విధానము:-   



  ఉలవలను ఒక తెల్ల వస్త్రములో మూటకట్టి 6 లేక 8 గంటలు నీళ్ళలో నానబేట్టి 8 గంటల తరువాత మూతబెట్టి ఉంచాలి అవి మూడు రోజులకు మొలకలెత్తగానే   తీసుకొని అవి రోజుకి ఒక టేబుల్ స్ఫూన్ చొ"న నమిలి తింటే మంచిది. మధుమేహం,షుగరు ఉన్నవారికి పచ్చి మొలకెత్తిన ఉలవలు చాలా మేలు చేస్తాయి. త్వరగా ఆరోగ్యవంతులు కావడానికి సహాయపడతాయి. ' మెనుస్ట్రువల్ ' ప్రాబ్లంస్ కుడా కంట్రోల్ చేస్తాయి.కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఉలవలు బాగా వేడి చేస్తుంది అనుకునే వారు వీటితోపాటు ఒక స్పూను మొలకెత్తిన పెసలను   తినాలి.మధుమేహం(diabetic)&   ఒబేసిటీ పేషేంట్లకు -ఇది చక్కటి మందులా పని చేస్తుంది.

  ఇప్పుడు ఉలవచారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము.




   కావలసిన పదార్ధాలు :-

 ఉలవలు          -        అర కప్పు
 చింతపండు గుజ్జు -       2,3 టీ స్పూన్లు
 మిరియాలు        -       1 స్పూను
 జీలకర్ర              -       1 స్పూను

 ఆవాలు          -       అర స్పూను
 కరివేపాకు      -       ఒక రెబ్బ
 కొత్తిమిర        -       ఒక కట్ట
  ఉప్పు            -       తగినంత
  నూనె            -       2 టీ స్పూన్లు


   ఉలవలను ముందురోజు రాత్రి నీళ్ళళో నానబెట్టి ఉదయము కుక్కరులో మెత్తగా ఉడకబెట్టాలి.ఉడికించిన నీళ్ళను తీసి ఒక పక్కగా పెట్టాలి. ఈ నీళ్ళు చాక్లెట్ రంగులో ఉంటాయి. ఉడికిన ఉలవలను గరిటతో మెత్తగా రుబ్బాలి. 
మిరియాలు,జీలకర్ర,ఆవాలు దోరగా వేయించి, చల్లారాక మెత్తగా పొడి చేయాలి. 

బాండీలో నూనె వేసి కాగాక కరివేపాకు వేసి వేయించి,చింతపండు గుజ్జువేసి కలుపుతూ, ఉలవలు ఉడికించిన నీళ్ళను అందులో వేసి కలపాలి. మెత్తగా పౌడరు చేసుకున్న మిరియాలు+ఆవాలు+జీలకర్ర పొడిని వేసి కలపాలి. మెత్తగా చేసుకున్న ఉలవ ముద్దను కూడా వేసి బగాకలపాలి. తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీరు పోసి స్టౌవ్ సిం లో పెట్టి గ్రేవీని మరీ చిక్కగా కాకుండా జారుగా ఉండేటట్లు ఉడికించి, స్టౌవ్ ఆపెయ్యాలి. గ్రేవీపైన సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమిరను జల్లాలి. చక్కటి ఆరోగ్యాన్నిచ్చే ఉలవచారు రెడీ! దీనిని వేడి,వేడి అన్నంలో,మరియు చపాతీలలో వేసుకొని తినవచ్చు.