కందిపొడి ( red gram powder)
వేడి,వేడి అన్నంలో కందిపొడి,పప్పునూనె ఒక స్పూను వేసుకొని కలుపుకు తింటే ! ఆహా ఏమి రుచి . కందిపొడి నేను చేసే విధానం ... ఇలా...
కావలసినవి:
కందిపప్పు - ఒక గ్లాసు
శనగపప్పు - అర గ్లాసు
మినప్పప్పు - పావు గ్లాసు
పెసరపప్పు - అర గ్లాసు
జీలకర్ర - రెండు స్పూన్లు
ఉప్పు - ఒక స్పూను
కారం -- ఒకటిన్నర స్పూను
పసుపు - పావు స్పూను
వెల్లుల్లి - ఒక పాయలో 5 రెబ్బలు
చేసే విధానం:
ముందుగా నాలుగు పప్పులూ విడి,విడిగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి.తరువాత జీలకర్ర కూడా వేయించాలి. కొద్దిగా చల్లారనిచ్చి, అన్నిపప్పులూ,జీలకర్రా,ఉప్పు,పసుపు,కారం,కావలసినవారు వెల్లుల్లి పచ్చివి వేసి కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఘాటు పోకుండా సీసాలో వేసి మూతపెట్టాలి.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home