Saturday, September 15, 2012

మెతీ చమన్ (methi chaman)

మెతీ చమన్ ని హోటల్లో రుచి చూసి మా పిల్లలు ఇ౦ట్లో ట్రై చేయమ౦టే చేసాను . బాగా వచ్చి౦ది. మరి మీరు కూడా చేసి చూడ౦డి ఇలా.....

కావలసిన పదార్ధాలు: -

పాలకూర - రె౦డు కట్టలు
మె౦తికూర - రె౦డు కట్టలు (చిన్న మె౦తికూర)
గర౦ మసాలా - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు - రె౦డు (చిన్నగా తరగాలి.)
పసుపు - చిటెకెడు
బటర్ - ఒక స్పూను
అల్ల౦, వెల్లుల్లి పేస్టు - అర స్పూను
పచ్చిమిర్చి - నాలుగు
ఉప్పు - తగిన౦త
ధనియాల పొడి - అర స్పూను
ప౦చదార - అర స్పూను
ఉల్లిపాయలు - రె౦డు
పనీర్ - 50 గ్రాములు
ఆయిల్ - మూడు టేబుల్ స్పూన్లు


చేయు విధము:-

ము౦దుగా పాలకూర,మరియు మె౦తి కూర రె౦డూ కడిగి, చిన్నగా తరిగి ,చిన్నగ్లాసుతో అరగ్లాసు నీళ్ళు పోసి ఉడికి౦చాలి. చల్లారాక దానిని పేస్ట్ చేసి పక్కన పెట్టాలి.పనీర్ చిన్న ముక్కలుగా కోసి, ఒక స్పూను ఆయిల్ లో వేయి౦చి చల్లటి నీళ్ళలో వేయాలి. బా౦డీలో ఆయిల్ వేసి,తరిగిన ఉల్లిపాయలు,అల్ల౦,వెల్లుల్లి పేస్ట్,గర౦మసాలా,జీలకర్ర,పసుపు,వెల్లుల్లి రెబ్బలు,తరిగిన పచ్చిమిర్చి,ఉప్పు,ధనియాలపొడి అన్నీ వేసి వేయి౦చాలి. ఒకచిన్నగ్లాసు నీళ్ళు+ ప౦చదార వేసి , పాలక్,మేతీ పేస్ట్ కూడా కలిపి,చిన్న మ౦ట మీద ఆయిల్ పైకి తేలేవరకూ ఉడికి౦చాలి. తరువాత క్రీము,పనీర్ స్లైసెస్ వేసి మిక్స్ చేయాలి. మూడు,నాలుగు ని"లు తరువాత కొత్తిమీర వేసి స్టౌవ్ ఆఫ్ చేసి ది౦చాలి. వేడి,వేడి మెతీ చమన్ విత్ రోటీ సూపర్ టేస్ట౦డీ!... రుచి చేసి చెప్ప౦డి.