Monday, October 12, 2015

కంద బచ్చలి కూర (kanda bachali curry)

కంద బచ్చలి కూర ఆవ పెట్టి చేసుకుంటే ఇంకా బాగుంటుంది.ఎలా ఉంటుందో నా రుచిలో చూద్దాం...








 కావలసినవి:-

తెల్ల కంద - పావు కిలో

బచ్చలి    - రెండు కట్టలు

పచ్చిమిర్చి  - నాలుగు

అల్లం       - చిన్నముక్క

కొత్తిమిర   - ఒక కట్ట

కరివేపాకు - ఒక రెబ్బ

ఆవపొడి   - అరస్పూను

కారం     -పావుస్పూను

ఉప్పు     - తగినంత

నూనె    -  3 టేబుల్ స్పూన్లు

ఇంగువ   - పావు స్పూను

చింతపండు గుజ్జు - ఒక స్పూను

ఆవాలు +మినప్పప్పు+జీలకర్ర+సెనగపప్పు+జీడిపప్పు+ఎండుమిర్చి+ఇంగువ+కరివేపాకు+పసుపు ఇవి పోపు సామాన్లు.

 చేయు విధము: ----

 కంద తొక్క తీసి,నీళ్ళలో ఒకటికి రెండుసార్లు బాగా కడగాలి. బచ్చలి కడిగి సన్నగా తరగాలి. రెండూ కలిపి ఒక చిన్నగ్లాసు నీళ్ళు పోసి ఉడికించాలి.

 అల్లం కొత్తిమిర,పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవపొడిలో,కారం,కొద్దిగా నూనె,నీరు కలిపి ఒకపక్కన ఉంచాలి.

బాండీ లో నూనె వేసి కాగాక పైనచెప్పిన పోపు సామాను ఒకటొకటిగావేసి, వేయించి,అందులో అల్లం వగైరా పేస్ట్ వేసి,ఉడికించి ఉంచుకున్న కందబచ్చలి ఒకసారి మెదిపి పోపులో వేయాలి. ఉప్పు వేసి బాగా కలిపి చింతపండు గుజ్జు వేసి కలిపి ఒక ఐదు ని"లు మగ్గనిచ్చి, దించేముందు కలిపి ఉంచుకున్న ఆవ అందులో వేసి బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి. ఆవ ఘుమ,ఘుమలతో కంద బచ్చలి కూర రెడీ!



1 Comments:

At March 12, 2016 at 8:59 PM , Anonymous telugu nris said...

chala bagundhi

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home