Tuesday, August 9, 2016

meal maker curry-- సోయా చంక్స్ కూర

సోయా చంక్స్ కూర చేయు విధానం:-

ముందుగా నీళ్ళు మరుగుతుండగా కొద్దిగా ఉప్పు,ఒక కప్పు మీల్ మేకర్స్ ను ఆ నీళ్ళలో వేసి..ఐదు ని"లు ఉంచి...ఆ నీరు వంపి,చల్లటి నీరు పోసి ..సోయాలను గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి.



కావలసినవి:-

ఉల్లిపాయలు - 2

టమోటాలు - 2

ఉప్పు  - తగినంత..

కారం  -  2 టే స్పూనులు

గరం మసాలా - 1 టీ స్పూను

ధనియా పౌడరు - 1 టీ స్పూను

అల్లం,వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు

పుదీనా,కొత్తిమీర - తగినంత

గసగసాలు పేస్టు - 2 టేబుల్ స్పూన్లు

కొబ్బరి, యాలకులు, లవంగ చెక్క పొడి..2 స్పూన్స్

ఆయిల్ - 4టేబుల్ స్పూన్లు





 చేయు విధానము : - 

కుక్కరులో ఆయిల్ వేడి చేసి, తరిగి ఉంచుకొన్న ఉల్లి,టమోటా ముక్కలను వేసి వేయించి, పుదీనా,కొత్తిమీర వేసి, అల్లం,వెల్లుల్లి పేస్టు వేసి వేయించి,ఉప్పు,కారం వేసి...పక్కన పెట్టిన సోయాలను వేసి బాగా కలిపి, మిగిలిన మిశ్రమాలను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి...ఒక గ్లాసు నీళ్ళు పోసి కుక్కరు మూత పెట్టి ..4 విజిల్స్ రానిచ్చి దించాలి..కొత్తిమీర గార్నిష్ చేసుకొని.....రోటీలలో కానీ,వేడి,వేడి రైస్ లో కానీ ఈ కూర చాలా బాగుంటుంది...ట్రై ఇట్...