Wednesday, February 8, 2017

ఉలవచారు బిరియాని (horsegram biryani)



 ఉదయము బిరియాని చేసుకోవాలంటే రాత్రి ఉలవలు నానబెట్టాలి.అరకిలో రైస్ కి 50గ్రా"ఉలవలు నానబెట్టాలి. నానిన ఉలవలను మెత్తగా ఉడికించాలి. చలార్చి గరం మసాలా మిరియాలు కొద్దిగా కలిపి ఉడికించిన నీళ్ళతోనే మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఈ ఉలవచారుని పక్కన ఉంచుకోవాలి.

ఉలవచారు బిరియానికి కావలసినవి:-
 బాస్మతి రైస్ - అరకిలొ
 కారెట్     -1
బీన్స్      - 6
పచ్చిమిర్చి - 8
కొత్తిమిర - ఒక కట్ట
పుదీన - ఒక కట్ట
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
నెయ్యి - తగినంత..నూనె - తగినంత

బిర్యాని ఆకు..బిర్యాని మసాలా పౌడర్+సాల్ట్
 బాస్మతి రైస్ కూడా కడిగి రెండున్నర గ్లాసుల నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకోవాలి.
 చేయు విధానం:-
 కారెట్, బీన్స్, ఉల్లిపాయ,పచ్చిమిర్చి, కొత్తిమిర, పుదీనా అన్నీ కడిగి సన్నగా తరుగుకోవాలి..కావలసినవారు బఠాణీ కూడా వేసుకోవచ్చును. కుక్కరులో నూనె, నెయ్యి వేసి కాగాక బిరియాని ఆకు, గరం మసాలా, బిర్యాని మసాలాపౌడర్ వేసి తరిగిన కూరగాయలు వేసి వేయించాలి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. తదుపరి. ఉలవచారు వేసి కలపాలి. నానబెట్టిన రైస్..ఆ నీళ్ళు పోసి బాగా కలపాలి. ఉడుకు రాగానే నిమ్మరసం ఒక చెక్క పిండి కలిపి మూత పెట్టాలి. ఒక విజిల్ రాగానే దించాలి. వేడి వేడి ఘుమఘుమలాడే ఉలవచారు బిర్యాని రైతాతో ఆరగించి చూడండి...