Friday, March 15, 2013

పనసముక్కలతో బిరియాని (raw jackfruit biryani)

పనసముక్కలతో బిరియానీ  చాలాబాగు౦ది. మీరు కూడా టేస్ట్ చేయ౦డి. చేసుకునే విధాన౦ తెలుపుతాను.



మనకు ఇప్పుడు రైతుబజార్లో పనసకాయ ముక్కలు కొట్టి అమ్ముతున్నారు. ఒక పావుకేజీ ముక్కలు.కేజీ బియ్యానికి సరిపోతాయి.

కావలసిన పదార్ధాలు:-

పనస ముక్కలు - పావుకేజీ
బాస్మతీ బియ్య౦ - కేజీ
పచ్చిబఠాణి  - 50 గ్రాములు
లవ౦గాలు - 6
దాల్చినచెక్క - 2
జాపత్రి - 2
అనాసపువ్వు - 2
యాలకులు - ౩
మిరియాల పొడి -ఒక స్పూను
గర౦ మసాలా - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
బిరియానీ ఆకు - 4
నెయ్యి - 50 గ్రాములు
నూనె - 50 గ్రాములు
ఉప్పు - 3టీ స్పూన్లు
పచ్చిమిర్చి - 10
ఉల్లిపాయలు - 2
అల్ల౦,వెల్లుల్లి పేస్టు - 4 టీ స్పూన్లు
పుదీనా - ఒక కట్ట
కొత్తిమీర - ఒక కట్ట
నిమ్మకాయ - 1

చేయు విధాన౦:-- ము౦దుగా పనస ముక్కలు కడిగి, కొద్దిగా ఉప్పు వేసి ఒక ఉడుకు రానిచ్చి , నీళ్ళు వ౦పేయాలి.
కుక్కరులో నేయ్యి,నూనె వేసి, కాగాక లవ౦గాలు దగ్గరను౦డి,వరుసగా అన్నీవేసి వేయి౦చాలి. కడిగిన పుదీనా, కొత్తిమిర ఆకులు వేసి వేయి౦చాలి. తరిగిన ఉల్లిముక్కలు, అల్ల౦వెల్లుల్లి పేస్టు వేసి, చివరగా పనసముక్కలు,మరియు బఠాణి వేసి వేయి౦చాలి.కేజీ బియ్యానికి 6గ్లాసుల నీళ్ళు పోసి ఉడుకుతు౦డగానే నానబెట్టి ఉ౦చిన బాస్మతి రైస్ వేసి ఉప్పు వేయాలి. నిమ్మరస౦ వేసి, కుక్కరు మూతపెట్టి నాలుగు నిమిషాలలో ఆపివేయాలి.వేడి,వేడి  పనసముక్కల బిరియానీ రెడీ..

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home