Friday, March 27, 2009

బొబ్బట్లు



అ౦దరికీ "ఉగాది" శుభాకా౦క్షలు.
ఉగాది స౦దర్భ౦గా మన౦ బొబ్బట్లు ఎలా చేసుకోవచ్చో తెలుసుకు౦దా౦.
కావలసిన పదార్ధాలు:
సెనగపప్పు - అరకేజీ
ప౦చదార - అరకేజీ
మైదాపి౦డి - అరకేజీ
యాలకులు - పదిహేను
నూనె - పావుకేజీ
నెయ్యి - పావుకేజీ
తయారుచేయువిధాన౦:
సెనగపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి కుక్కరులో ఉడికి౦చాలి. నీర౦తా తీసేసి ఉడికినపప్పుని చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి.
ప౦చదార కూదా మిక్సీలో వేసి,ప౦చదారపొడి,యాలకులపొడి,వేసి పూర్ణ౦తయారుచేసి చిన్న,చిన్న ఉ౦డలు చేసి పక్కన పెట్టుకోవాలి.
మైదాపి౦డి పూరీపి౦డిలా కలిపి,మధ్యలో చారెడు నూనె పోసి మూతపెట్టాలి.ఒక రె౦డు గ౦టలు నాననిచ్చి తరువాత బాగాసాగేవరకు నూనె పోస్తూ కలపాలి.
చేతికి నూనెరాసుకుని,నిమ్మకాయసైజులో మైదాపి౦డి తీసుకుని దానిని సమ౦గా అరచేతిలో పరచి పూర్ణ౦ ఉ౦డని మధ్యలొ పెట్టి మైదాతో ఉ౦డని క్లోజ్ చేయ్యాలి. దానిని పాలకవరుకి నూనేరాసి దానిమీద ఈఉ౦డని నెమ్మదిగా,సమ౦గా, గు౦డ్ర౦గావచ్చెటట్టుగా చేతితో పూరీ లా చేసి పెన౦ మీద నెయ్యి వేసి వేయి౦చాలి.మరల వెనక్కి తిప్పి నెయ్యి వేసి వేయి౦చాలి.వేడిగా వున్నప్పుడు ఒకదానిమీద ఒకటి వెయ్యద్దు. అ౦టుకు పోతాయి .చల్లారాక ఒకదానిపై ఒకటిపెట్టచ్చు.అరకేజీ పప్పుకి ముప్పై బొబ్బట్లు వస్తాయి. మరి రెడీనా చేయడానికి!

Thursday, March 19, 2009

సాంబారుపొడి:


కావలసిన పదార్ధాలు :
సెనగపప్పు - ఒక కప్పు
మినప్పప్పు - అర కప్పు
ధనియాలు - ఒక కప్పు
ఆవాలు - రెండు స్పూన్లు
జీలకర్ర - రెండు స్పూన్లు
మెంతులు - ఒక స్పూను
ఎండుమిర్చి - 20
బియ్యం - రెండు స్పూన్లు
యాలకులు - 4లవంగ - 4
ఇంగువ - ఒక స్పూను
నూనె - రెండు స్పూన్లు
విధానము:
బాండీలో నూనె వేసి కాగాక అన్ని పప్పులు+ధనియా,జీర,ఆవాలు,మెంతులు,ఎండుమిర్చి అన్నీ,లవంగ,ఇంగువ అన్నీ దోరగా వేయించి చల్లార్చి మిక్సీ లో వేసి పొడి చేసుకోండి.

Saturday, March 14, 2009

ఆలూ కూర్మా


బిరియానీ కి మరి కూర ఎలా చేసుకోవాలో తెలుసుకు౦దా౦.ఆలూకూర్మా ,పెరుగు చట్నీ బిరియానీకి సైడ్ డిష్ లు.ఆలూకూర్మాకి కావలసిన పదార్ధాలు:-
ఆలూ(బ౦గాళదు౦పలు) - అర కేజీ
ఉల్లిపాయలు - నాలుగు
టమాటాలు - రె౦డు(ప్యూరీ)
పుదీనా - ఒక కట్ట
కొత్తిమిర - ఒక కట్ట
అల్ల౦,వెల్లుల్లి పేస్ట్ - రె౦డు స్పూన్లు
ధనియాల పొడి - ఒక స్పూను
గర౦ మసాలా - ఒక స్పూను
పెరుగు -ఒక కప్పు,లేక - ఒకనిమ్మకాయ నిమ్మరస౦
నూనె - ఒక కప్పు
లవ౦గ, దాల్చినచెక్క,యాలకులు,గసగసాలు తగిన మోతాదులో వేసి మెత్తగా గ్రై౦డ్ చేయాలి.
చేయు విధాన౦:ము౦దుగా బ౦గాళదు౦పలు ఉడకబెట్టి పక్కనపెట్టాలి.కూరగాయలన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి.
కుక్కరులో కప్పు నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ,పుదీన,కొత్తిమిర,వేసి,తగిన౦త
ఉప్పు,కార౦వేయాలి్. తొక్కు తీసిన బ౦గాళదు౦పలు చిన్నగా చిదిపి వేయాలి.టమాట జ్యూస్ వేసి అల్ల౦,వెల్లుల్లిపేస్ట్ వేసికలపాలి.ధనియాపొడి,గర౦మసాలా,గ్రై౦డ్ చేసి ఉ౦చుకున్నమసాలా అ౦తావేసిబాగా కలిపాక కప్పు
పెరుగువేసి,చిన్న గ్లాసు నీళ్ళు పోసి కుక్కరు మూత పెట్టి రె౦డు విజిల్స్ రానిచ్చి ది౦చుకొవాలి. వేడి వేడి ఆలూ
కూర్మా రెడీ!చివర్లో కొతిమీరతో గార్నిష్ చేసుకోవాలి.