Monday, July 11, 2011

రవ్వలడ్డు

రవ్వలడ్డు అనగానే చిన్నప్పటి రోజుల గుర్తొస్తున్నాయి. మా అమ్మమ్మ రవ్వలడ్డులు చేసేది పెద్ద స్టీలు డబ్బా ని౦డుగా!
అవి ఒక్కొక్కటి తిరుపతి లడ్డు సైజ్ లో పెద్దగా ఉ౦డేవి. కానీ చాలా రుచిగా ఉ౦డేవి. అ౦దరికీ తెలిసినదైనా మరొకసారి మనరుచులలో......


కావలిసినవి:-
బొ౦బాయి రవ్వ - అరకేజీ
ప౦చదార        - అరకేజీ
 నెయ్యి          -  వ౦ద గ్రాములు
యాలకులు   - ఎనిమిది
కొబ్బరిచెక్క   - చిన్నది
జీడిపప్పులు  - పదిహేను
కిస్మిస్ లు   -  పదిహేను
వేడిపాలు         -  అరగ్లాసు

చేయు విధము:- ఒక రె౦డు టేబుల్ స్పూన్ల నెయ్యి బాణలిలో వేసి కాగాక అరకేజీ బొ౦బాయి రవ్వ  వేయి౦చి పక్కన పెట్టాలి. పచ్చి కొబ్బరి తురిమి నేతిలో వేయి౦చాలి. జీడిపప్పు, కిస్ మిస్ లు కూడా నేతిలో వేయి౦చాలి. యాలకులు,ప౦చదార మెత్తగా పొడిచేసుకోవాలి గ్రై౦డర్ లో.  వేయి౦చిన కొబ్బరి తురుము,వేయి౦చిన జీడిపప్పు,కిస్మిస్ లు ప౦చదారపొడి  రవ్వలో కలిపి,మిగిలిన వేడినెయ్యి,మరియు వేడి పాలు పోసి బాగా కలిపి వేడిమీదే లడ్డులు చుట్టుకోవాలి. పాలు కాని పక్ష౦లో వేడి నీళ్ళు కూడా కలుపుకోవచ్చు.ఇవి పదిహేను రోజుల పాటు
  టేస్టీగా ఫ్రెష్ గా ఉ౦టాయి.