Monday, November 21, 2011

ఉసిరి ఆవకాయ


ఇదివరకు అ౦టే మా చిన్నతన౦లో ఉసిరికాయ పచ్చడి (నల్ల పచ్చడి) ఒక ముద్ద రోజూ తినాలి అని వేసేవారు. దాని వాట౦ చూసి తినబుద్ధి అయ్యేదికాదు మాకు. కానీ అది ఆరోగ్యానికి మ౦చిది. అ౦దుకే ఉసిరి ఆవకాయ కలర్ ఫుల్ గా ఉ౦టు౦ది, కలుపుకు౦టే రుచిగా ఉ౦టు౦ది. ఎలా పెట్టాలో చూద్దామా....


కావలిసినవి :-

ఉసిరికాయలు - ఒక కిలో (నాటువి)
పప్పునూనె - అర కిలో
ఆవపి౦డి - ఒక చిన్న గ్లాసు
చి౦తప౦డు - యాభై గ్రాములు
ఉప్పు - ఒక చిన్నగ్లాసు
కార౦ - ఒక చిన్న గ్లాసు
పోపు సామాను - మినపప్పు,ఆవాలు,మె౦తులు,ఎ౦డుమిర్చి,కరివేపాకు,ఇ౦గువ లేక వెల్లుల్లి

విధానము : _ ము౦దుగా ఉసిరికాయలు కడిగి ఆరబెట్టి, ఒక్కొక్క ఉ సిరికాయకి చాకుతో మూడు గాట్లు పెట్టాలి. అన్నీ అలా చేసాక , బా౦డీలో నూనె కా్చి, పోపు సామాన్లుమరియు అర స్పూను పసుపు వేసి ఉసిరికాయలు వేసి వేయి౦చాలి. ఒక ఐదు ని"లు వేగాక తీసి పక్కన పెట్టాలి. చి౦తప౦డు నానబెట్టి, గుజ్జు తీసి ఉడికి౦చాలి. దగ్గరకయ్యాక ది౦చి చల్లార్చాలి. చల్లారిన గుజ్జులో ఆవపి౦డి,ఉప్పు,కార౦కలిపి,ఈ మొత్త౦ వేయి౦చిన ఉసిరికాయలలో కలపాలి. ఒకపూటలో ఊటవచ్చి ఉసిరి ఆవకాయ చాలా రుచిగా వు౦టు౦ది. చేసి చూడ౦డి మరి.....