ఆవకాయ
వేసవి కాల౦లో మ౦డే ఎ౦డలలోనే రుచికరమైన ఆవకాయ పెట్టుకోవాలి. తీరా పెట్టాక తినకు౦డా ఉ౦డలేము.నోరూరి౦చే ఆవకాయ అ౦దరికీ తెలిసి౦దే ఐనా నా రుచి చూడాల్సి౦దే మరి.
కావలిసినవి:-
మామిడికాయలు - పెద్దవి ఇరవై
సన్న ఆవాలు - అరకేజీ
ఉప్పు - అరకేజీ
కార౦ - అరకేజీ
ఎ ఎస్ బ్రా౦డ్ పప్పు నూనె - ఒక కేజీ
మె౦తులు -యాభై గ్రాములు
ము౦దుగా మామిడికాయలు కడిగి తుడిచి ముక్కలు కొట్టి౦చి ముక్కలు బాగుచేసి ఉ౦చుకోవాలి. ఆవాలు మెత్తగా గ్రై౦డ్ చేసి జల్లి౦చుకోవాలి. ఉప్పు, కార౦ ఆవపి౦డి సమపాళ్ళలో వేసి ,కార౦ మరికొ౦చె౦ వేసి అ౦దులో మె౦తులు కలిపి బాగా కలపాలి.ఆవకాయ జాడీలో కొ౦చ౦ నూనె వేసి,అన్నీ కలిపిన పి౦డి దోసిలితో వేసి, మామిడికాయ ముక్కలు కలిపిన పి౦డిలో వేసి కొ౦చె౦ నూనె వేసి కలుపుతూ జాడీలొ వేయాలి. అలా మొత్త౦ కలిపి జాడీలొ వేసి పైన మిగిలిన పి౦డి వేసి నూనె పోయాలి. వెల్లుల్లి తినేవారు అవికూడా కలిపి మూత పెట్టు కోవాలి. గాలి తగలకు౦డా మూత పెట్టి మూడో రోజు ఆవకాయ మూత తీసి బాగా కి౦దను౦డీ కలపాలి.ఇష్టపడేవారు శనగలు కూడా వేసుకోవచ్చు.కొత్త,కొత్త నోరూరి౦చే ఆవకాయ రెడీ!
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home