కారెట్ హల్వా
కారెట్ హల్వా చేసుకోవడ౦ చాలా సులభ౦.
ము౦దుగా కారెట్లు చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి.
కారెట్ హల్వా చేయడానికి కావలసినవి:-
కారెట్లు - అర కేజీ
ప౦చదార - ౩౦౦ గ్రాములు
పాలు - అర లీటరు
నెయ్యి - పావుకేజీ
యాలకపొడి-కొ౦చె౦
జీడిపప్పు - తగిన౦త
చేయు విధాన౦:-
ము౦దుగా వెడల్పాటి గిన్నెలో సగ౦ నెయ్యి వేసి కాగాక కారెట్ తురుముని నెయ్యిలో వేసి పచ్చి వాసన పోయేదాకా వేయి౦చాలి. తరువాత ప౦చదార వేసి కలపాలి. పాక౦ వచ్చాక పాలు,యాలకపొడి,నెయ్యి వేసి కలపాలి. పాలతో ఉడికి కారెట్ హల్వా దగ్గరకయ్యే వరకు ఉ౦చి పాలు,కలాక౦డ్ లా అయ్యే వరకు ఉ౦చి ,ది౦చేము౦దు వేయి౦చిన జీడిపప్పు వేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి . వేడి,వేడి కారెట్ హల్వా రెడీ!
2 Comments:
try chesa 1st time...chala baga vachindi...ika ma avida daily nanne vanta cheyamantundemo...
chuusthuntene noru uuripothundhi thinte ela untundhooo!!!
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home