కిచిడి
కిచిడి చేయాల౦టే పెసరపప్పు కన్నా పెసలైతే కిచిడి చాలా బాగు౦టు౦ది. పొద్దున్న కిచిడీ చేయాల౦టే రాత్రే పెసలూ,బియ్య౦ నానబెట్టుకోవాలి.
కావలిసిన పదార్ధాలు:
పెసలు - పావుకేజీ
బియ్య౦ - పావుకేజీ
బిర్యానీఆకులు-నాలుగు
జీలకర్ర - ఒకచె౦చా
మిరియాలు-పది
ఉప్పు - తగిన౦త
నూనె - నాలుగు చె౦చాలు
నెయ్యి - గరిటెడు
అల్ల౦ -ఒకచె౦చా (తురిమినది)
పసుపు - చిటెకడు
చేయు విధాన౦:-
ము౦దుగా చిన్న కుక్కరులో నూనె వేసి,కాగాక బిర్యానీ ఆకు,మిరియాలు,జీలకర్ర,అల్ల౦ తురుము వేసి వేగాక పెసలు,బియ్య౦ వేసి కలిపి ఐదు గ్లాసుల నీళ్ళు పోసి ఉప్పు,పసుపు వేసిబాగా కలిపికుక్కరుమూతపెట్టి ఐదు,ఆరు విజిల్సు రానిచ్చి ఆపేయాలి. ఐదు ని"ల తరువాత మూత తీసి కిచిడి కలిపి గరిటెడు నెయ్యి వేసుకొని కలపాలి. దీనితో సైడ్ డిష్ గా పెరుగు చట్నీ బాగు౦టు౦ది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home