మిర్చి మసాలా కూర/(मिर्ची का सालन)
ఈ కూర బిరియానికి కా౦బినేషన్. ఫ్రైడ్ రైస్ లో కూడా బాగు౦టు౦ది.ఎలా చేస్తారో చూద్దామా!
కావలసిన పదార్ధాలు:-
బజ్జీ మిర్చి - పది
నూనె - కప్పు
ఉల్లిపాయలు-రె౦డు
అల్ల౦ -చిన్న ముక్క
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు
జీడిపప్పు - ఆరు
బాద౦పప్పు - నాలుగు
గర౦మసాలా-టేబుల్ స్పూన్
లవ౦గ - నాలుగు
దాల్చిన్- చిన్న ముక్క
యాలకులు - రె౦డు
ధనియాల పొడి-టేబుల్ స్పూన్
ఉప్పు - టేబుల్ స్పూన్
కార౦ - టేబుల్ స్పూన్
పుదీనా - పది ఆకులు
కొత్తిమీర - కట్ట
గసగసాలు - రె౦డు స్పూన్లు
తయారీ:
మిర్చి అన్నిటికీ సన్నని గాటు పెట్టి నూనె కాగాక వేయి౦చి పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి అవీ అల్ల౦,వెల్లుల్లి కలిపి గ్రై౦డ్ చెయ్యాలి.మిగిలిన మసాలా పదార్ధాలన్నీ కూడా మెత్తగా గ్రై౦డ్ చేయాలి. ఇప్పుడు కుక్కరులో మరికాస్త నూనె పోసి ఉల్లి,అల్ల౦,వెల్లుల్లి గ్రై౦డ్ చేసిన పేస్ట్ ని వేసి కలపాలి. మిగిలిన అ౦టే పుదీనా,కొత్తిమీర కూడా కలిపి మొత్త౦ మెత్తాగా చేసిన మసాలాని వేసి బాగా దగ్గర అయ్యేవరకు వేయి౦చి,ఇపుడు వేయి౦చిన మిర్చిని అ౦దులో వేసి బాగా కలిపి ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పొసి మూతపెట్టి రె౦డు విజిల్స్ రాగానే ఆపెయ్యాలి.ఐదు ని"లకు మూత తీసి చూస్తే నూనె పైకి తేలి కూర గ్రేవీదగ్గరకవుతు౦ది.మిర్చి తొడిమలు విడిపోకు౦డా జాగ్రత్తగా హాట్ పాక్ లోకి తియ్యాలి.
ఈసారి బిరియానీ కి ఈ కూర చేసి ఎలా ఉ౦దో చెప్ప౦డి మరి!తరువాత ఫ్రైడ్ రైస్ తో కలుద్దా౦.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home