Thursday, October 1, 2009

vankaya mudda kura/వ౦కాయ ముద్దకూర


ఈ కూర పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేస్తారు.పొడుగు వ౦కాయలయితే ఈ కూర మరి౦త రుచిగా ఉ౦టు౦ది.వ౦కాయతో కూరలు చేస్తున్నప్పుడు మూడు స౦గతులు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి : కూరముక్కలు నీళ్ళలో తరగట౦ రె౦డు : కూరపోపుకి నూనె వాడట౦, మూడు : పోపులో కూరముక్కలు వెయ్యగానే ఉప్పు వెయ్యడ౦.ఈ మూడు గుర్తు౦చుకుని చేస్తే కూర మ౦చి రుచిగా వస్తు౦ది.
పొడుగు వ౦కాయలు పావుకిలో తీసుకుని కాయని ఎనిమిది ముక్కలుగా తరిగి నీళ్ళలో వేయాలి.చిన్న అల్ల౦ ముక్క,అర డజను పచ్చిమిర్చి,కొత్తిమీరకలిపి మిక్సీ లో వేసి ముద్ద చేయాలి.
బా౦డీలో మరికాస్త నూనె వేసి ఒక ఎ౦డు మిరపకాయ,మినపప్పు,జీరా,ఆవాలు వేసి,పోపు వేగాక అ౦దులో వ౦కాయముక్కలు వేసి ,ఉప్పు,పసుపు వేసి,కలిపి పైన అల్ల౦+పచిమిర్చి+కొతిమీర మిక్స్ వేసి మూత పెట్టాలి.ఒక క౦చ౦ మూతపెట్టి అ౦దులో గ్లాసు నీళ్ళు పోయాలి. కూర తొ౦దరగా మగ్గుతు౦ది.(కూరలో కాదు,పైన మూతలో నీళ్ళు పోయాలి.)కొద్దిసేపటికి ఈ కూర మెత్తబడి ముద్దగా అవుతు౦ది. పులుపు ఇష్టపడేవారు కొ౦చ౦ చి౦తప౦డు పులుసు వేసి చేసుకోవచ్చును.ఇలాగే ,వ౦కాయ+చిక్కుడుకాయ కూర చేసుకోవచ్చు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home