Sunday, January 4, 2009

పాల కోవా




మృదువుగా ,నోట్లో లాలాజలాన్ని ఊరించే కోవా, అమ్మ చేసే పాలకోవా అంటే చిన్న పిల్లలకీ మరింత ఇష్టం .చూడగానే నోరూరించే కోవా ఎలా చేయాలీ అంటే .....



కావలసినవి ;
 ఆవు పాలు కానీ ,
 గేద పాలు కాని చిక్కగా ఉండాలి,
 ఒక లీటరు పాలకి పావు కేజీ చక్కర,  
 ఇవే కావలసినవి.
 శ్రద్ధగా ,ఓపికగాపాలకోవా తయారుచేసుకోవాలి.


విధానము; 

గాస్ స్టౌవ్ సిం లో పెట్టి ,వెడల్పాటి మందమైన గిన్నెలో పాలుపోసి మరగ నివ్వాలి. పాలు మీగడ పట్టకుండా గరిటతో తిప్పుతూ ,లీటరు పాలు పావు లీటరు అయ్యే వరకు తిప్పాలి. అప్పుడు పావుకేజీ చక్కర వేసి మరల తిప్పాలి .పాలు ,చక్కర కలిసి పల్చగా అవుతాయి పాలు .తొందరగా అయి పోవాలని స్టౌవ్ హైలో పెడితే కోవా ఎర్రగా వస్తుంది .కోవా తెల్లగా రావాలంటే స్టౌవ్ తగ్గించే ఉంచాలి. పంచదార పాకం అయి పల్చబడిన కోవా గట్టిబడుతుంది .మరీ ముద్ద అవకుండా కిందకి దించేసి పప్పు గరిట తో కోవా ని మెత్తగా నూరాలి. చేతికి నెయ్యి రాసుకుని కోవాని చిన్న ,చిన్న ఉండలు చేయాలి పళ్ళానికినెయ్యి రాసి ఉండలు పళ్ళెములో పెట్టాలి. .ఉండలు ఆరుతుండగా ,చూపుడు వేలితో ఉండని అదమాలి .అలా అన్ని ఉండలు అదిమి కోవాలను ఆరనివ్వాలి . కోవా మీద వేలి గుర్తు లేక పొతే కోవా తిన్నట్టు అనిపించేది కాదు మా చిన్నప్పుడు. ఇప్పుడు కుడా అంతే.ఇలా కష్టం అనుకుంటే ,కోవా గట్టి పడగానే నెయ్యి రాసిన పళ్ళెంలోకి వంపి దానిని సమముగా సద్ది ఏ షేపైనా కట్ చేసుకోవచ్చును. లీటరు పాలకి చిన్నవైతే 35కోవాలు వస్తాయి .

ఇంతేనండి చేసే విధానము చేసి రుచి చూసి చెప్తారు కదూ......

1 Comments:

At January 31, 2009 at 3:32 PM , Blogger Ramani Rao said...

చదువుతుంటే అమ్మ చేసినవి గుర్తొస్తున్నాయి. దీపావళి కి చేసేది ..

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home